సూపర్ స్టార్ మహేశ్ బాబు, తెలంగాణ ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ ఎంత మంచి స్నేహితులో మనకు తెలిసిందే. భరత్ అనే నేను సినిమా చూసిన కేటీఆర్ మహేశ్ బాబును పొగడ్తలతో ముంచెత్తారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తన జీవితానికి దగ్గరగా ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. సినిమా చూసిన అనంతరం మహేశ్ బాబు, కొరటాల శివతో కేటీఆర్ ఓ ఇంటర్యూలో పాల్గోన్న విషయం తెలిసిందే.
మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఏ సమస్య వచ్చినా అప్పుడే పరిష్కారం చేస్తారు. ఇటివలే మహేశ్ బాబు , మంత్రి కేటీఆర్ ఇద్దరు ఒకరి ఒకరూ ట్వీట్లు చేసుకున్నారు. గతంలో మహేశ్ కేవలం అమ్మాయిలకు మాత్రమే సెల్ఫీలు ఇస్తారు..కానీ నేను మాత్రం అబ్బాయిలకు కూడా ఇస్తాను అని సరదాగా చెప్పారు మంత్రి కేటీఆర్.
It's true ktr garu abbailake kuda selfi lu estaru @KTRTRS ,
pic.twitter.com/y4n0d8Udsn
— talluri dhfm (@talluri_t) June 1, 2018
Ha Ha @urstrulyMahesh that was for you https://t.co/b2CZbZPbK0
— KTR (@KTRTRS) June 1, 2018
తాజాగా ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్టూ ను ట్వీట్టర్ లో కేటీఆర్ కు ఈవిధంగా ట్యాగ్ చేశాడు. అవును కేటీఆర్ గారు మీరు అబ్బాయిలకు కూడా సెల్ఫీలు ఇస్తారని మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ఈపోస్ట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆపోస్ట్ ను రీట్వీట్ చేస్తూ మహేశ్ బాబును ట్యాగ్ చేసి..మహేశ్ ఇది నీ కోసమే అంటూ మహేశ్ బాబుకు మెసేజ్ పంపారు. దింతో ఆట్వీట్ స్పందించిన మహేశ్ స్మైల్ ఫోటో పెట్టి మంత్రి కేటీఆర్ కు రిప్లే ఇచ్చారు. విరిద్దరి ట్వీట్టర్ సంభాషణను చూసి నెటిజన్లు సంబరపడిపోతున్నారు.