సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కాలా. ఈ చిత్రం ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే కర్ణాటకలో మాత్రం రజనీ సినిమాలను విడుదల కానివ్వమని కర్ణాటక ఫిలిం ఛాంబర్ తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలపై మరోసారి చర్చించి తీర్మానిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార స్వామి అన్నారు.
ఈ విషయంపై కన్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రశీణ్ శెట్టి స్పందించారు. ఒకవేల రజనీకాంత్ వచ్చి బహిరంగంగా క్షమాపణలు చెప్పినా.. కాలా చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కానివ్వమని అన్నారు.ఇక కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరి సినిమాలను కర్ణాటకలో విడుదల కానివ్వమని ప్రవీణ్ శెట్టి పేర్కొన్నారు. కావేరి జల విషయంలో తమిళులకు మద్దతుగా రజనీ, కమల్ మాట్లాడిన సంగతి తెలిసిందే.
ఇక కర్ణాటక ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సారా గోవింద్ మాట్లాడుతూ.. కర్ణాటకలో రజనీకాంత్, కమల్ హసన్ సినిమాలు తప్ప మిగతా తమిళ సినిమాల విడుదలకు మాకు ఎలాంటి అభ్యతరం లేదని చెప్పారు. మరోవైపు తెలుగులోనూ కాలా చిత్రం పెద్దగా అమ్ముడు పోలేదు. దానికి ప్రధాన కారణం నిర్మాత ధనుష్ తెలుగు డబ్బింగ్ రైట్స్ ని రూ. 40 కోట్లు చెప్పడమే. రజనీ వరుస సినిమాలు ప్లాఫ్ కావడంతో నిర్మాతలు కాలాపై పెద్దగా ఆసక్తి చూపట్లేదట.