‘ఏదైనా జరగొచ్చు’ రెడీగా ఉండండి- నాని

358
Nani
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేసిన తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 1 టీవీ షో ఎంత సూప‌ర్ హిట్ అందరికి తెలిసిందే. అయితే సీజన్‌ 1 ముగిసినప్పట్నుంచి అసలు బిగ్‌బాస్-2 వస్తుందా?.. రాదా..? ఒక వేళ ఉంటే హోస్ట్‌గా ఎవరుంటారు..? షోకు వచ్చే సెలబ్రిటీలు ఎవరు..? ఇలా సందేహాలు జనాలకు వస్తున్నాయి. అయితే వాటన్నింటినికీ నాచురల్ స్టార్ నాని ఫుల్‌స్టాప్ పెట్టేస్తూ ఓ ట్వీట్ చేశాడు.

స్టార్ మా టీవీలో తెలుగు ‘బిగ్‌బాస్’ సీజన్ 2 ప్రసారానికి ముహూర్తం కుదిరింది. నేచురల్ స్టార్ నాని ఈల వేస్తూ వచ్చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ కూడా విడుదలైంది. ‘జూన్ 10.. 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. 1 బిగ్ హౌస్.. బిగ్ బాస్ 2’ అంటూ నాని ట్వీట్ చేశాడు.

Nani

వచ్చేనెల 10 నుంచి తాను బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నానని నాని చెప్పాడు. ‘ఏదైనా జరగొచ్చు’ రెడీగా ఉండండంటూ నాని మరింత ఆసక్తి పెంచుతున్నాడు. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ, శుక్ర వారాల్లో రాత్రి 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. బిగ్‌బాస్‌ సీజన్ 2లో నాని హోస్ట్ గా వ్యవహరిస్తాడని ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన టీజర్ ను కూడా ఇప్పటికే విడుదల చేశారు.

- Advertisement -