వెంకన్న ఆదాయంలో తెలంగాణ వాటా ఇప్పించండి..

256
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాపై హైకోర్టు విచారణ చేపట్టింది. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్ దాఖలు చేసిన పిటీషన్ పై స్పందించిన హైకోర్టు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, టీటీడీకి నోటీసులు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఏపీ, తెలంగాణ అంతర్భాగంగా ఉండేదని, రాష్ట్ర విభజన జరిగినప్పటికీ టిటిడికి తెలంగాణకు చెందిన బోర్డు మెంబర్స్ ఉన్నందున వాటా ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

తెలంగాణలో టిటిడికి సంబంధించి చాలా ఆస్తులు ఉన్నాయని, పలు దేవాలయాల అభివృద్ధికి టిటిడి నిధులు సమకూరుస్తున్నందున వచ్చే ఆదాయంలో తెలంగాణ రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు సంవత్సరానికి కేవలం రూ. 56 లక్షల రూపాయలు మాత్రమే చెల్లిస్తుందని.. ఇంకా బకాయి కింద వెయ్యి కోట్ల రూపాయలు రావాలని పిటీషనర్ తరపు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్ధానం మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని దేవాదాయ శాఖ చట్టం ప్రచారం కామన్ గుడ్ ఫండ్ ( CGF ) కింద 5శాతం కూడా రావాల్సి ఉందన్నారు.

- Advertisement -