తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు తెలంగాణ టీడీపీ సినియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు. ఎస్సీ వర్గికరణపై కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. 15సంవత్సారాల నుంచి నేను కేసీఆర్ తో మాట్లాడకపోయినా పిలవగానే నా బిడ్డ పెళ్లికి వచ్చి ఆశిర్వదించాడన్నారు. కేసీఆర్ ను చూస్తుంటే నాకు స్వీర్గియ ఎన్టీఆర్ గుర్తుకు వస్తున్నారన్నారు. తన పెళ్లికి ఎన్టీఆర్ ముహుర్తం పెట్టాడని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ చేసిన సేవలు మరువరానివన్నారు. ఎన్టీఆర్ ప్రియశిష్యుడైన కేసీఆర్..ఎన్టీఆర్ బాటలోనే అభివృద్ది కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాడన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశాడు మోత్కుపల్లి నర్సింహులు. పార్టీలో సినియర్ లీడర్ అయినా నాకు మహానాడు సభకు ఆహ్వానం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో సినియర్ వ్యక్తులకు గౌరవం దక్కడం లేదన్నారు. తన బిడ్డ పెళ్లి దగ్గరుండి చేస్తానన్న చంద్రబాబు అసలు పెళ్లికే రాలేదన్నారు. అదే కేసీఆర్ ను పిలవగానే టైంకు వచ్చి ఆశిర్వదించి వెళ్లాడని చెప్పుకొచ్చారు. పేదోడికి, తిండికి లేనోడికి రాజ్యసభ అవకాశం ఇచ్చారని అన్నారు. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన బడుగు, బలహీన వర్గాలకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు.
రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు కు ఎందుకు అంతప్రేమనో అర్దం కావడం లేదన్నారు. చంద్రబాబు చెబితేనే రేవంత్ కాంగ్రెస్ చేరానని రేవంత్ బహిరంగం గానే చెప్పుకొస్తున్నాడన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. తనకు గవర్నర్ పదవి ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశాడన్నారు. గవర్నర్ పదవి వచ్చే టైంలోనే ప్రత్యేక హోదా ఉద్యమం నడుస్తుందని పదవి ఆపేశారన్నారు.