తమిళంలో భరత్ అనే నేను….

265
mahesh babu
- Advertisement -

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, కైరా అద్వానీ తారాగణంగా తెరకెక్కిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం భ‌ర‌త్ అనే నేను. ఫిక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసకుని విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై మరో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను తమిళంలో కూడా రిమేక్ చేసి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

mahesh babu

గతంలో కూడా మహేష్ బాబు హీరోగా నటించిన సినిమాలను కూడా తమిళంలో రిమేక్ చేశారు. ఆ సినిమాలు తమిళంలో కూడా ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. మ‌హేష్ న‌టించిన ఒక్క‌డు( త‌మిళంలో గిల్లీ) , పోకిరి (త‌మిళంలో పొక్కిరి) కోలీవుడ్‌లో రీమేక్ చిత్రాలు విడుద‌లయ్యాయి. తాజాగా మహేష్ బాబు డైనమిక్ సీఎం గా నటించిన భరత్ అనే నేను మూవీ తమిళంలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

- Advertisement -