మెరుపులా మెరుస్తున్న రకుల్…

984
Rakul-preet-
- Advertisement -

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దాదాపు అగ్ర హీరోలందరి సరసన ఈ భామ నటించింది.  అయితే గత కొంత కాలంగా వార్తలకు దూరంగా ఉన్న ఈ భామ తాజాగా మళ్లీ వార్తల్లో నిలిచింది.

rakulpreet

అదెలాగంటే జిమ్ లో వర్కవుట్స్ దాదాపు అందరు తారలు చేస్తూనే ఉంటారు. కానీ ఇది ఓ మొక్కుబాటు విషయంగానే పరిగణిస్తారు తప్ప.. అందులో ఎంజాయ్మెంట్ ను వెతుక్కోలేరు. రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అలా కాదు. జిమ్ లో గడపడాన్ని తెగ ఎంజాయ్ చేస్తుంది రకుల్ ప్రీత్. రీసెంట్ గా ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ చిన్న వీడియో చూస్తే.. జిమ్ లో రకుల్ ఎంతగా కష్టపడుతుందో అర్ధమవుతుంది. కేవలం వెయిట్ పెరగకుండా ఉండేందుకు.. లేదా తన ఫిజిక్ ని కాపాడుకోవడానికి అయితే ఇంతగా కష్టపడాల్సిన పని లేదు. అసలు ఇదో స్వీట్ పెయిన్ అంటోంది రకుల్ ప్రీత్.

ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక బాలీవుడ్ సినిమా ఉంది. అజయ్ దేవగన్ ఆ సినిమాలో హీరోహా నటించాడు. అంతే కాకుండా కోలీవుడ్ లో సూర్య కార్తీలతో నటించడానికి కూడా రెడీ అవుతోంది. టాలీవుడ్ లో కూడా ఆఫర్లు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. నాగ చైతన్య కేఎస్. రవీంద్ర కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో అమ్మడు సెలెక్ట్ అయినట్లు టాక్ రావడం వైరల్ అయ్యింది. మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ వీడియో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -