వైరల్ … గ్లామర్ డోస్ పెంచిన సమంత

221
samantha
- Advertisement -

కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్ రాథోడ్‌ విసిరిన ఫిట్‌నెస్ సవాల్‌కు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. దేశ ప్రజలంతా ఆరోగ్యంగా, పిట్ నెస్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో రాజ్యవర్ధన్‌ సింగ్‌ ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ అనే ఛాలెంజ్‌‌ను సోషల్ మీడియాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఫిట్ నెస్ కు దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ సవాల్‌ను స్వీకరించిన సెలబ్రిటీలు తమ ఫిట్‌నెస్ ఎలా కాపాడుకుంటున్నారో తెలియజేస్తూ కండలు తిరిగిన శరీరాన్ని ఫోటోలు వీడియోల ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ ఛాలెంజ్ లో పలువురు తెలుగు సినీ హీరోలు కూడా ఉన్నారు.

Naga-Chaitanya-

వారిలో అక్కినేని అఖిల్, నాగచైతన్య కూడా తమ జిమ్ విన్యాసాలను ప్రదర్శించారు. అయితే నాగచైతన్య తన జిమ్ ఛాలెంజ్ ను తన సతీమణి సమంతకు విసరడంతో ఆమె చైతూ విసిరిన ఈ సవాల్‌కు సై అంది. అన్నట్టుగానే జిమ్ లో తన జిమ్ విన్యాసాలను ప్రదర్శించింది సమంత. వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. ఈ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జిమ్ చేస్తున్న సమంతను చూసినవారు సమంతను చూసి పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. సమంత ఏంటి ఇంత హాట్ గా ఉందని కొందరు అంటుంటే.. మరి కొందరు సమంతకు పెళ్లైనా తనలో ఇంకా ఏమాత్రం గ్లామర్ తగ్గలేదని, తాను ఇంకా గ్లామర్ పాత్రలు చేస్తానంటూ చెప్పకనే చెబుతోందని మరికొందరు అంటున్నారు. మరికొందరైతే సమంత పెళ్లైన తర్వాత ఇంత ఘాటు ప్రదర్శన అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సమంత తన భర్త నాగచైతన్య విసిరిన సవాల్ ను విజయవంతంగా పూర్తి చేసింది. సమంత జిమ్  చేస్తున్న వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

https://youtu.be/gWZ_iKuZmCU

- Advertisement -