నేడు కుమారకు అగ్నిపరీక్ష..

213
Kumaraswamy
- Advertisement -

కన్నడ రణస్థలంలో మరో ఆసక్తికర పరిణామానికి విధానసభ వేదిక కానుంది. సీఎంగా బలపరీక్షకు ముందే స్పీకర్ ఎన్నిక రూపంలో కుమారస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కొబోతున్నారు. స్పీకర్ ఎన్నిక బరిలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ అభ్యర్ధిని నిలపడంతో మరోసారి పొలిటికల్ హిట్‌ పెరిగిపోయింది. ఆపరేషన్ కమల నేపథ్యంలో కాంగ్రెస్,జేడీఎస్ ఎమ్మెల్యేలు రిసార్టుల్లోనే ఉన్నారు. రిసార్టు నుంచి నేరుగా కర్నాటక అసెంబ్లీకి రానున్నారు.

బీజేపీ నుంచి స్పీకర్ అభ్యర్థిగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్ సురేశ్‌కుమార్‌ బరిలో ఉండగా అధికార కూటమి తరఫున కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం 12.15 గంటలకు స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతుంది.

కర్ణాటక శాసనసభలో మొత్తం 224 స్థానాలుండగా, ప్రస్తుతం సీఎం కుమారస్వామి రెండు స్దానాల నుంచి విజయం సాధించారు. దీంతో ప్రస్తుతం 221 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సాధారణ మెజార్టీకి 111 ఓట్లు అవసరం. కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి 117 మంది సభ్యుల బలం ఉండటంతో గెలుపుపై ఎలాంటి సందేహం అవసరం లేదని అంటున్నారు.

అయితే, మధ్యాహ్నం తర్వాత ఏంజరుగుతుందో మీరే చూస్తారు అని బీజేపీ స్పీకర్ అభ్యర్థి సురేశ్‌కుమార్ తెలిపారు. అయితే బీజేపీ పాచిక పారదని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. స్పీకర్‌గా తమ పార్టీ అభ్యర్ధి రమేశ్‌కుమార్ విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.

- Advertisement -