క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన డివిలియర్స్..

226
devilliars
- Advertisement -

దక్షిణాఫ్రికా డాషింగ్ బ్యాట్స్‌మెన్‌ డివిలియర్స్ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు. ఐపీఎల్‌లో బెంగళూరు తరపున ప్రాతినిధ్యం వహించిన డివిలియర్స్ ఆ జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించాడు. కెరీర్‌లో దక్షిణాఫ్రికా తరపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు.

14 సంవత్సరాలుగా తన కెరీర్‌కు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు ఏబీ. ఇండియా, ఆస్ట్రేలియాలపై సిరీస్‌లు గెలిచిన తర్వాత రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావించానని చెప్పాడు. యువకులు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. నేను చాలా అలసిపోయాను. ఇది చాలా కఠిన నిర్ణయమని తెలుసు. చాలా రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. మంచి ఫామ్‌లో ఉన్నపుడే తప్పుకోవాలని భావించనని తెలిపాడు. దేశీయంగా టైటన్స్ టీమ్‌కు మాత్రం ఆడతాను అని డివిలియర్స్ స్పష్టంచేశాడు.

Image result for devilliers

114 టెస్టుల్లో 50.66 సగటుతో 8765 రన్స్ చేశాడు. అందులో 22 సెంచరీలు ఉన్నాయి. 228 వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు చేశాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బాల్స్), ఫాస్టెస్ట్ సెంచరీ (31 బాల్స్), ఫాస్టెస్ట్ 150 (64 బాల్స్) రికార్డులు ఏబీ పేరిటే ఉన్నాయి. సౌతాఫ్రికా తరఫున టెస్టుల్లో రెండో అత్యధిక టెస్ట్ స్కోరు (278 నాటౌట్) కూడా ఏబీ పేరు మీదే ఉంది.

- Advertisement -