నేడు ఏ వార్త అయినా క్షణాల్లో ప్రపంచ వ్యాప్తంగా చేరవేయబడుతోంది. దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియా. నేటి సమాజంలో సోషల్ మీడియా కీలకంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏది నిజమో… ఏది అబద్ధమో.. నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. పని గట్టుకుని కొందరు అసత్యాలను ప్రచారం చేస్తున్నారు.
ఇక సెలబ్రెటీల వార్త గురించైతే చెప్పక్కర్లేదు అనుకుంటా.. వాళ్లు తుమ్మినా.. దగ్గినా.. వాళ్లకు ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చిందంటూ ప్రచారం చేస్తుంటారు. తాజాగా సీనియర్ నటి రాధికకు సంబంధించిన ఓ తప్పుడు వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాధిక కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారని, ఆ కారణంగా ఆమె బయటికి రావడం లేదంటూ సోషల్ మీడియాలో తమిళనాట తెగ వైరల్ అవుతుంది.
ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా రాధికను అడగగా.. దీనిపై స్పందించిన రాధిక నాకు ఎలాంటి క్యాన్సర్ లేదని… అలాంటి పుకార్లను నమ్మవద్దంటూ చెప్పుకొచ్చారు. ఇక మన తెలుగు రాష్ట్రాలలోనూ పార్థీ గ్యాంగ్ తిరుగుతుందని, చిన్న పిల్లలను, మహిళలను చంపేస్తున్నారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఎంతవరకు నిజమో… ఎంత వరకు అబద్దమో తెలియాల్సి ఉంది.