తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా పరిచయమై ఆ తర్వాత డైరెక్టర్‌గా మారి విజయాలను అందుకుంటున్న దర్శకులు చాలా మంది ఉన్నారు. అందులో కొరటాల శివ ఒకరు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సూపర్ హిట్ విజయాలను నమోదు చేసుకుంటున్నారు కొరటాల. అయితే గతంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారి ‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’ చిత్రాలతో అగ్ర దర్శకుల జాబితాలో చేరాడు.
ఈ సినిమాల విజయంతో మంచి డైరెక్టర్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కించిన మూవీ ‘భరత్ అనే నేను’. రాజకీయ నేపధ్యంలో రూపొందించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడమే గాక సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది.
అయితే ఈ సినిమా తర్వాత కొరటాల మూవీ ఎవరితో చేయనున్నాడని సినీ అభిమానులు వేచిచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవితో కొరటాల ఓ సినిమా చేయనున్నాడన్న వార్త ఊపందుకుంది. అప్పుడే ఆయనకు కథను వినిపించాడని, దానికి ఆయన ఓకే చేశాడని సమాచారం. ప్రస్తుతం చిరు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ‘సైరా’ అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కొరటాల-మెగాస్టార్‌ల సినిమా పట్టాలెక్కనుంది తెలుస్తోంది.