అక్కినేని ఫ్యామిలితో పూరి మల్టీస్టారర్..?

184
Puri Jagannadh’s Next With Akkineni Heroes..?
- Advertisement -

డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాధ్ గతకొంత కాలంగా సరైన హిట్‌లు లేక సతమతమవుతున్నారు. ఇటీవల తనయుడు పూరి ఆకాష్‌తో తెరకెక్కించిన చిత్రం ‘మెహబూబా’.ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా బక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో మరో సినిమాకు తెర వెనుక కసరత్తులు చేస్తున్నారు పూరి. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం చూపించకపోవటంతో మళ్లీ తన తనయుడితోనే మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో ఓ సినిమా రూపోందనుందని గత కొన్ని రోజలు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

 Puri Jagannadh’s Next With Akkineni Heroes..?

అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఓ స్టార్ హీరోతో పూరి  సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట. టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగచైతన్యతో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అప్పుడే నాగ్‌కు కథను వినిపించడం, ఆయన ఓకే చేయడం వంటివి జరిగాయని తెలుస్తోంది. ప్రస్తుతం నాగ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ‘ఆఫీసర్’ అనే మూవీ తెరకెక్కి విడుదలకు సిద్దంగా ఉంది.

నాగ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బంగార్రాజు’ అనే సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మూవీ తర్వలో పట్టాలెక్కనుంది. అయితే పూరి నాగ్ కాంబినేషన్‌లో తెరకెక్కె ఈ సినిమా మూడవ చిత్రం కానుంది. గతంలో వీరిద్దరికి కలయికలో వచ్చిన  ‘శివమణి’, ‘సూపర్‌’ చిత్రాలు మంచి హిట్‌ను సాధించిన విషయం తెలిసిందే.

- Advertisement -