హీరో నాగార్జున, సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఆఫీసర్. 25 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మళ్లి సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. విరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన శివ సినిమా ఎంతపెద్ద హిట్ సాధించిందో మనకు తెలిసిందే. ఈసినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ గా మైరా సరీన్ నటించింది. ఈమూవీ లో నాగార్జున పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈసినిమాపై పలు రూమర్లు వినబడతున్నాయి. టికెట్ అనే హాలీవుడ్ సినిమా వర్మ కాపీ కోట్టాడని పలువ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా వర్మ ఓ ట్వీట్ చేశారు.
కర్ణాటకకు చెందిన ఓ ఐపిఎస్ ఆఫీసర్ జీవితం అధారంగా ఈసినిమాను తెరకెక్కించినట్టు తెలిపారు. ముంబాయికి చెందిన పేరున్న పోలీసు అధికారి కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందంతో ఏసీపీగ ప్రసన్నను నియమించారన్నారు. ఈకేసుకు సంబంధించిన వివరాలు ప్రసన్న తనకు 2010లో వివరించారని…ఆకేసు ఆధారంగానే ఆఫీసర్ సినిమాను తెరకెక్కించామన్నారు వర్మ. సిన్సియర్ ఆఫీసర్ ప్రసన్న పాత్రలో నాగార్జున పోషించారన్నారు. ఆకేసు వివరాలు ప్రసన్న నాతో చెప్పాక అప్పుడే సినిమా తీయాలనుకున్నానని తెలిపారు.
నా అభిప్రాయం ప్రకారం నాగార్జునలో కూడా ప్రసన్న పోలీకలున్నాయన్నారు రామ్ గోపాల్ వర్మ. ప్రసన్న, నాగార్జున ఇద్దరి మైండ్ సెట్ కూడా ఒకే లాగా ఉన్నాయన్నారు. ప్రసన్న ఒరిజినల్ క్యారెక్టర్ ను నాగార్జున రూపంలో ఆఫీసర్ సినిమాలో చూపించామన్నారు. వేరే సినిమాల నుంచి కాపి కొట్టి సినిమా తీసే అవసరం తనకు లేదన్నారు. ఇక ఈసినిమాను మొదట మే25 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించినా కొన్ని అనివార్య కారణాల వల్ల జూన్ న విడుదల చేస్తున్నట్లు తెలిపారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.