కర్ణాటక రాజకీయాల్లో క్షణానికో ప్రకటన వెలువడుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు బిజెపి ప్రభుత్వం ప్రొటెమ్ స్పికర్ ను నియమించింది. ప్రొటెమ్ స్పీకర్ గా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కేజే బొపయ్యను ఎంపిక చేశారు. న్యాయనిపుణులతో, పార్టీ సినియర్ నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు కర్ణాటక గవర్నర్ వాజూభాయ్. ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గవర్నర్. మరికొద్ది సేపట్లో ప్రొటెం స్పీకర్ గా బోపయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది. బోపయ్య గతంలో అసెంబ్లీ స్పీకర్ గా కూడా పనిచేశారు. రాజకీయాల్లో తనకు సుదీర్ఘ అనుభవం ఉండటంతో అతని ప్రొటెమ్ స్పీకర్ గా అవకాశం ఇచ్చినట్టు సమాచారం.
ఒక ప్రొటెమ్ స్పీకర్ గా బోపయ్యను నియమించడంపై మండిపడుతుంది కాంగ్రెస్ పార్టీ. తమ పార్టీలో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా తమకు అవకాశం ఇవ్వకుండా బోపయ్యకు ఎలా ఇస్తారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేశ్ పాండేను నియమించకుండా బోపయ్యను ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. బిజెపి రాష్టంలో చట్టాన్ని ఉల్లంఘిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రేపు సాయంత్రం 4గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ విశ్వాస పరీక్ష ఎదుర్కొవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం మనకు తెలిసిందే. బీజేపీ సభ్యుల సంఖ్య 104 ఉండగా, కాంగ్రెస్ 78, జేడీఎస్ 36 ఇతరులు 3 ఉన్నారు. బీజేపీ బల పరీక్షలో నెగ్గాలంటే 111మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. బీజేపీ కి ఉన్న సంఖ్యతో గెలవాలంటే 14మంది విపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గౌర్హాజరు కావాల్సి ఉంది.
ఇక కర్ణాటక పీఠం ఎవరికి వరిస్తుందో రేపు తెలియనుంది.