దేశ వ్యవసాయ రంగ చరిత్రలో సువర్ణధ్యాయం లిఖితమయ్యేలా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకం నిలిచిపోయింది. రైతులకు పెట్టుబడి అందించే ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. దేశంలోని అన్నిరాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఈ పథకంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సినీ దర్శకుడు హరీష్ శంకర్ రైతు బంధు పథకం అద్భుతమని కొనియాడారు.
రైతుబంధు పథకం ఎంతో ఉన్నతమైనదందని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కమ్మదనం గ్రామంలో హరీష్ శంకర్‌కు కొంత భూమి ఉంది. దీనికి గాను ప్రభుత్వం నుంచి రైతుబంధు సాయం అందింది. అయితే ప్రభుత్వం అందజేసిన చెక్‌ను హరీష్ శంకర్ తిరిగిచ్చేశారు.
నాకు ఉన్న పొలానికి కూడా రైతుబంధు పథకం కింద కొంత మొత్తం వచ్చింది. ఎవరన్నా పేద రైతు సహాయార్థం ఇది వాడితే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మొత్తానికి మరికొంత జోడించి నేను సర్పంచ్ గారికి బాధ్యతాయుతంగా అందచేస్తున్నాను అని హరీష్ శంకర్ చెప్పారు. రాష్ట్రంలో పంట భూములను కలిగి ఉన్న చాలా మంది ప్రముఖులు తమకు అందుతున్న రైతుబంధు సాయాన్ని తిరిగి విరాళంగా ఇచ్చేస్తున్న సంగతి తెలిసిందే.