ఎన్టీఆర్ బర్త్ డేకి అదిరిపోయే గిఫ్ట్..!

366
NTR Birth day gift for fans
- Advertisement -

వరుస హిట్ సినిమాలతో జోష్ మీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సీరియస్‌గా వర్కవుట్ చేస్తుండగా ఫస్ట్ లుక్‌ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 20 న ఎన్టీఆర్ 35 పడిలోకి అడుగుపెట్టబోతున్నాడు.

జూనియర్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్‌ని ప్లాన్ చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్. ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 19న ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను అనౌన్స్ చేస్తున్నట్టు ట్వీట్ చేశారు.

ఇక సోషల్ మీడియాలో ఎన్టీఆర్ బర్త్ డే హంగామా మొదలైపోయింది. ఎన్టీఆర్ బర్త్ డే వీక్, ఎన్టీఆర్ బర్త్ డే, ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను ట్రోల్ చేస్తూ.. కామన్ డీపీగా ఎన్టీఆర్ సింహాసనం‌పై కూర్చున్న ఫోటో వైరల్ అవుతోంది.

ఈ చిత్రాన్ని ‘అజ్ఞాతవాసి’ చిత్ర నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ వస్తుండటంతో ఈ సినిమాకు ‘అసామాన్యుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ టైటిల్‌ విషయంలో త్రివిక్రమ్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.

- Advertisement -