ఐపీఎల్-11 సీజన్లో ఆటగాళ్లు ఆటతో మాత్రమే కాకుండా.. పాటలు, డైలాగులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా కోల్కత్తా జట్టు ఆటగాళ్లకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ జట్టు సహ యజమాని షారుఖ్ నటించిన సినిమాలలోని డైలాగులను చెప్పి మెప్పించే ప్రయత్నం చేశారు కోల్కత్తా ఆటగాళ్లు. కెప్టెన్ దినేశ్ కార్తీక్‌తో పాటు, సునిల్ నరైన్, కుల్దీప్ యాదవ్, పీయూష్ చావ్లా ఆటగాళ్లు షారుఖ్ సినిమా డైలాగులు చెప్పారు. అయితే ఆ డైలాగులు చెప్పేందుకు చేసిన వారి ప్రయత్నం నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తోంది.
అయితే ఈ వీడియో షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘వాళ్లు మైదానంలో చేసిన ప్రదర్శన మాత్రమే మీరు చూసి ఉంటారు.. కానీ ఇప్పుడు వారి రాకింగ్ ఫెర్ఫామెన్స్ చూడండంటూ.. రెడ్ చిల్లీస్ ట్వీట్ చేసింది. ఈ వీడియోను చూసిన షారుఖ్.. నా జట్టును ఎంతగానో ప్రేమిస్తున్నాను. అయితే నేను మీకు క్రికెట్‌ను వదిశాను కదా.. నాకు యాక్టింగ్ వదిలేయండి అంటూ సరదాగా ట్వీట్ చేశాడు.
మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతోంది కోల్కత్తా. ఐదు జట్లు ప్లే ఆఫ్ బెర్త్ కోసం పారాడుతుండగా.. కోల్కత్తా కూడా అందులో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్కత్తా 3వ స్థానంలో ఉంది. ఇప్పటికే రెండు సార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. ఈ సీజన్లో కూడా చాంపియన్‌గా నిలవాలని తెగ శ్రమిస్తోంది. మంగళవారం ముంబైపై గెలిచి ప్లే ఆఫ్ దిశగా అడుగులు వేస్తోంది.
You’ve seen them smashing it on the field, now watch them rocking the screen – the @iamsrk style 😎 #KKRHaiTaiyaar@KKRiders @DineshKarthik @ShivamMavi23 @imkuldeep18 @SunilPNarine74 @RealShubmanGill @robbieuthappa @lynny50 #PiyushChawla @VenkyMysore #IPL2018 pic.twitter.com/RN24iUOK5m
— Red Chillies Entertainment (@RedChilliesEnt) May 16, 2018