దుమ్ములేపుతున్న సాహో షూటింగ్ ఫోటోలు..

604
rebal star prabhas next movie sahoo shooting pics are trending in social media
- Advertisement -

బాహుబ‌లి చిత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రెబ‌ర్ స్టార్ ప్ర‌భాస్. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ చేయ‌బోయే సినిమా సాహోపై భారీ అంచ‌నాలు పెరిగిపోయాయి. భారీ బ‌డ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌క్కుతున్న ఈసినిమాకు ర‌న్ రాజా ర‌న్ సినిమా ద‌ర్శ‌కుడు సుజిత్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈసినిమాను దుబాయ్
లో చిత్రిక‌రిస్తున్నారు. ప్ర‌భాస్ స్నేహితులైన యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.   ఈసినిమా షూటింగ్ ఎక్కువ శాతం విదేశాల‌లోనే చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇటివ‌లే ప్ర‌భాస్ కూడా షూటింగ్ పాల్గోని యాక్ష‌న్ పార్ట్ లో పాల్గోన్నాడు.

rebal star prabhas next movie sahoo shooting pics are trending in social media

ఈసినిమాలో ఒకే ఫైట్ కోసం రూ.60 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని తెలుస్తుంది. సినిమాలో ఆ ఫైటింగ్  కీల‌కంగా ఉండ‌నుంద‌ని స‌మాచారం. ఈ యాక్ష‌న్ సీన్స్ ను హాలీవుడ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ కెన్నీ బేట్స్ రూపొందిస్తున్న‌ట్టు తెలిపారు. . సాహో మూవీ షూటింగ్ కు సంభందించి కొన్ని స్టిల్స్ ను మ‌రియు కారులో చేజింగ్ సీన్స్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సైలిష్ లుక్ లో ప్ర‌భాస్ బైక్ పై కూర్చున్న ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. తాజాగా న‌టుడు అరుణ్ విజ‌య్ సాహో సినిమా షూటింగ్ లో పాల్గోన్నాడు. ఆ సీన్స్ ను ఇప్పుడు త‌న ట్వీట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అరుణ్ ట్వీట్ట‌ర్ లో పెట్టిన ఫోట‌ల‌ను చూస్తేనే అర్ధ‌మ‌యిపోతుంది సాహో సినిమాను ఎంత‌గ్రాండ్ రూపొందిస్తున్నారో.

rebal star prabhas next movie sahoo shooting pics are trending in social media

ఈఫోటోలు అభిమానుల్లో భారీ అంచ‌నాల‌ను పెంచుతున్నాయి. ఈసినిమాలో నీల్ నితిన్ ముఖేష్, జాక్ ష్రాఫ్ , చుంకీ పాండే, అరుణ్ విజ‌య్ లు ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈసినిమాలో హీరోయిన్ గా శ్ర‌ద్దా క‌పూర్ న‌టింస్తుంది. ఇక ఈసినిమా బాలీవుడ్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రైట్స్ ను ఏకంగా రూ.120కోట్ల‌కు ద‌క్కించుకున్నారు టీ సిరిస్ భూష‌న్. విలైనంత త్వ‌ర‌గా ఈసినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు చిత్ర బృందం.

- Advertisement -