వరుస హిట్లతో మంచి సక్సెస్ జోష్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ఘూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అజ్నాతవాసి సినిమా ప్లాప్ తో కసి మీద ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాగైనా ఈసినిమాతో హిట్ కోట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు దర్శకుడు త్రివిక్రమ్. ఇక ఈసినిమా తొలి షెడ్యూల్ ను ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. రాయసీమ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ఇక త్రివిక్రమ్ తాను తీస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ తో సినియర్ హీరోయిన్లను రీఎంట్రీ చేస్తున్నాడు. అత్తారింటికి దారేది సినిమాలో నదియా, సన్నాఫ్ సత్యమూర్తిలో స్నేహ, అజ్నాతవాసిలో ఖుష్బూ లు కీలక పాత్రల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమాకు కూడా ఓ సినియర్ హీరోయిన్ ను సంప్రదించినట్టు సమాచారం.
ఎన్టీఆర్ సరసన నాగ, యమదొంగ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన రంభను ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనుంది. త్వరలోనే ఈ ఘూటింగ్ రంభ పాల్గోంటుందని సమచారం. ఈసినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దె నటించగా..నాగబాబు, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తన సినిమాలతో సినియర్ హీరోయిన్లకు మరో లైఫ్ ఇస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.