ఏంటి జీవితాంతం జైల్లోనే ఉంటాననుకున్నారా..?-సల్మాన్

262
Did You Think I Was Going in Forever Say To Salman Khan
- Advertisement -

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‎ఖాన్‎కు కృష్టజింకల కేసులో జోధ్‎పూర్ న్యాయం స్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ల క్రితం కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్‎కు ఐదేళ్ల శిక్ష పడడంతో ఆయన నటిస్తున్న సినిమా నిర్మాతలకు ముచ్చెమెటలు పట్టాయి. తాజాగా ఈ విషయంపై సల్మాన్ స్పందించారు. సల్మాన్ కథానాయకుడిగా నటించిన రేస్ 3′ చిత్ర ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ నేపథ్యంలో ముంబైలో చిత్ర యూనిట్ ప్రెస్‎మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్‎తో ఓ విలేకరి కృష్ణజింకల కేసు గురించి ప్రస్తావించారు.

Did You Think I Was Going in Forever Say To Salman Khan

‘ఏంటి నేను జీవితాంతం జైల్లో ఉంటానని అనుకున్నారా? అంటూ సల్మాన్ ఆ విలేకరిని ఎదురు ప్రశ్నవేశారు. ఇందుకు ఆ విలేకరు లేదని జవాబిచ్చాడు. ధన్యవాదాలు.. ఎందుకంటే ఆ కేసు గురించి నేను బాధపడటం లేదని సల్మాన్ తెలిపారు. అనంతరం కథువా అత్యాచార సంఘనపై స్పందించారు. ఇటువంటి ఘోరాలు మళ్లీ జరగకుండా చూడాలి అన్నారు. మరోవైపు సల్మాన్ తనకు వేసిన శిక్షను కొట్టివేయాల్సిందిగా జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టులో అభ్యర్థన పెట్టుకున్నారు.

ఇక సల్మాన్ నటించిన రేస్ 3 సినిమాకు రెమో డిసౌజా దర్శకత్వం వహించారు. ఇందులో సల్మాన్ సరసన జాక్వెలీన్ ఫెర్నాండెజ్, డైసీ షా నటిస్తున్నారు. సన్నీ డియోల్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడులో సల్మాన్ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు, ఆయన నటించిన ‘బజరంగీ బాయిజాన్’ ‘సుల్తాన్’ వంటి చిత్రాలు రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.

- Advertisement -