- Advertisement -
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో విషాదం చోటుచేసుకుంది. కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. మృతి చెందిన వారంతా ఫ్లై ఓవర్ నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికులే.
శిథిలాల కింద 50 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్న అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫ్లైఓవర్ కింద నిలిపి ఉంచిన పలు వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వారణాసి ఫ్లై ఓవర్ కూలిన ఘటనపై యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ చర్యల్లో పాల్గొనాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య వారణాసి వెళ్తారని చెప్పారు.
- Advertisement -