క‌ర్ణాట‌కలో ఓడిపోయిన న‌టుడు సాయికుమార్..

223
karnataka elections actor sai kumar loss
- Advertisement -

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో సినీ న‌టుడు సాయి కుమార్ బీజేపీ త‌ర‌పున బ‌రిలోకి దిగాడు. క‌ర్ణాట‌క‌లోని బాగేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న పోటీ చేశాడు. అయితే నేడు వెలువ‌డుతున్న ఫ‌లితాల‌లో సాయి కుమార్ కు మాత్రం నిరాశే ఎదురైంది. తాను గెలుస్తాన‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సాయి కుమార్ ఓట‌మి దిశ‌గా వెలుతున్నాడు. ఇక తాజాగా వెలువ‌డిన ఫ‌లితాల్లో సాయి కుమార్ 4వ స్ధానంలో ఉన్నాడు. మొద‌టి రౌండు నుంచి ఆయ‌న చివ‌రి స్దానంలోనే కొన‌సాగుతూ వ‌స్తున్నాడు.

in karnataka elections Sai Kumar Loses, BJP Wins
క‌ర్ణాట‌క‌లో బిజెపి విజ‌య‌ప‌థం వైపు దూసుకుపోతున్నా కానీ..బాగే ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం వెనుకంజ‌లో ఉండిపోయింది. సినిమాల్లో టాప్ యాక్ట‌ర్ గా ఎదిగిన సాయి కుమార్… రాజాకీయాల్లో మాత్రం ఆ రేంజ్ కు ఎద‌గ‌లేక‌పోతున్నాడు. బాగేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్ధి సుబ్బా రెడ్డి 2900 ఓట్ల మెజారిటీతో ఉండ‌గా రెండవ స్ధానంలో జేడీఎస్ అభ్య‌ర్ధి మ‌నోహ‌ర్ ఉన్నారు. ఇక మూడ‌వ స్ధానంలో సీపీఎం అభ్య‌ర్ది ఉండ‌గా…నాలుగో స్ధానంలో న‌టుడు సాయి కుమార్ ఉన్నాడు. దాదాపు సాయి కుమార్ గెలుపు పై ఆశ‌లు లేన‌ట్టే చెప్పుకొవ‌చ్చు.

- Advertisement -