ధోనీ డబుల్ సెంచరీ చేయడమేంటని ఆశ్చర్యపోకండి. ఎమ్ ఎస్ ధోని వెండితెర మీద డబుల్ సెంచరీ కొట్టేశాడు. క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఎమ్ఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’. ఈ సినిమాను నిర్మించిన ఫాక్స్ స్టార్ ప్రొడ్యూసర్ శనివారం ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎం.ఎస్.ధోనీ సినిమా 204 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయని తెలిపారు. ఇండియా వ్యాప్తంగా 175.7 కోట్లు, ఓవర్సీస్లో 29 కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు చెప్పారు. సెప్టెంబర్ 30న ఈ సినిమా విడుదలైంది. తెలుగు, తమిళం వంటి ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. నీరజ్ పాండే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోనీగా నటించాడు. ఎలాంటి స్టార్స్ లేక పోయినా కేవలం ధోనీ మీద అభిమానం వల్లే సినిమాకు ఇంత భారీగా వసూళ్లు వచ్చాయి.