మహేష్‌ కొత్త సినిమా టైటిల్‌..!

214
- Advertisement -

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా షరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాకు ఇప్పటివరకు రకరకాల టైటిల్లు వినిపించాయి. తాజాగా ఆ సినిమా టైటిల్‌కు సంబంధించి మరో వార్త హల్‌చల్ చేస్తోంది. తెలుగు, తమిళభాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఏజెంట్ శివ’ అన్న టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.

mahesh babi

సినిమాలో నిఘా విభాగం (ఐబీ) అధికారిగా కనిపించే మహేశ్ పేరు శివ అని టాక్. ఓ కేసుకు సంబంధించిన చిక్కు ముడులను విప్పుతాడట మహేశ్. అందుకే సినిమాకు ఏజెంట్ శివ అన్న పేరుకే చిత్ర బృందం అంతా ఓకే చేసిందట. చిత్ర యూనిట్ ఓకే చేసేసింది కాబట్టి.. అదే ఫైనల్ చేశారని చెబుతున్నారు. మరి అసలు టైటిట్ ఏంటి అన్నది తెలియాలంటే.. మరో రెండు వారాలు ఆగితే టైటిల్ కన్‌ఫ్యూజన్‌కు తెరపడే అవకాశం ఉంటుంది.

తన సినిమాలకు ఫస్ట్ లుక్ టీజర్తోనే భారీ హైప్ క్రియేట్ చేసే మురుగదాస్… మహేష్ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు.

- Advertisement -