భారీ వసూళ్లతో దూసుకుపోతున్న‘భరత్ అనే నేను’

260
'Bharat Ane Nenu' box office collection
- Advertisement -

మహేశ్ బాబు కథానాయకుడిగా ‘భరత్ అనే నేను’ ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుని, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా కలెక్షన్లు రూ. 205 కోట్లు దాటాయి. ఈ విషయాన్ని నిర్మాత డీవీవీ దానయ్య తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తొలి రోజు నుంచే రికార్డుల వేటను కొనసాగిస్తున్న ఈ చిత్రం మూడు వారాల్లోనే రూ. 205 కోట్లను తాకడం గమనార్హం. తొలి రోజున రూ. 40 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, తొలివారంలో రూ. 161 కోట్లను, ఆపై రెండో వారంలో రూ. 190 కోట్ల కలెక్షన్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

'Bharat Ane Nenu' box office collection

అయితే భరత్ అనే నేను ఏ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుందో అందరికి తెలిసిందే. ఒక నాయకుడు ఎలా ఉండాలి. ఇచ్చిన వాగ్దానాలను హామీలను ఎలా నెరవేర్చుకోవాలనే పాయింట్ ని కరెక్ట్ గా ప్రజెంట్ చేశాడు దర్శకుడు కొరటాల శివ. అంతే కాకుండా పాలిటిక్స్ లోని వివిధ అంశాలను అందరికి అర్థమయ్యేలా చాలా సున్నితంగా చూపించాడు.

అయితే ఇలాంటి సినిమా ఇప్పుడు పరబాషకు కూడా వెళితే మంచి టాక్ ను అందుకుంటుందని చెప్పవచ్చు. ఒక సామాజిక అంశం కావడంతో ఇలాంటి కథలకు భాషాబేధం ఉండదు. అందుకే భరత్ అనే నేను సినిమాను ఇతర భాషల్లో డబ్ చేయాలని చూస్తున్నారు. బాలీవుడ్,కోలీవుడ్ కూడా అనువదించదానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు దర్శకుడు కొరటాల శివ స్పెషల్ గా తెలియజేశారు. కాగా, ప్రస్తుతం తన కుటుంబంతో సినిమా సక్సెస్ ను విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు, తన నెక్ట్స్ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు.

- Advertisement -