కాంగ్రెస్ చుక్కలు చూపిస్తే..మేం చెక్కులిస్తున్నాం

229
ktr
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకంలో భాగంగా రెండో రోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రైతులకు చెక్కులు పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపిస్తే…తాము చెక్కులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచే రైతులకు రూ.5లక్షల బీమా పథకం అమలు చేస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్.

సిరిసిల్ల జిల్లాలో రైతుబంధు పథకంతో రూ.100 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. వచ్చే యాసంగి వరకు జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పంటకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు చెప్పారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.వరంగల్ అర్బన్ జిల్లా క్యాతంపల్లిలో రైతుబంధు చెక్కులను పంపిణీ చేసిన కడియం.. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు.

టీఆర్ఎస్‌ది రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పారు మంత్రి హరీష్. సంగారెడ్డి జిల్లాలో చెక్కులు,పాస్ బుక్‌లను పంపిణీ చేసిన హరీష్..రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. రైతు రాజు కావాలన్నదే కేసీఆర్ అభిమతమని చెప్పారు. మెదక్ జిల్లాలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవెందర్ రెడ్డి,వికారాబాద్ జిల్లా కొడంగల్ లో మంత్రి పట్నం మహెందర్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు.

- Advertisement -