రాజకీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్న మెగాస్టార్ చిరంజీవి.. 150వ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేసిన ‘మీలో ఎవరు కోటిశ్వరుడు’ కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ సారి హోస్ట్‌గా మెగాస్టార్ వ్యవహరించనున్నారు. వెండితెర మీద మీరు (ప్రేక్షకులు) నన్ను గెలిపించారు. బుల్లితెర మీద మిమ్మల్ని గెలిపించడానికి, కోటీశ్వరులను చేయడానికి వస్తున్నానని అంటున్నారు చిరంజీవి. అయితే, చిరంజీవికి రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చనే విషయంలో భారీ చర్చే సాగుతోంది.
ఈ ప్రోగాం కోసం చిరంజీవికి భారీ రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు నిర్వాహకులు. ఒక్కో ఎపిసోడ్ కు రూ. 10 లక్షలు ఇవ్వనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎన్ని ఎపిసోడ్ లు ప్రసారమైతే అన్ని పది లక్షలు చిరంజీవికి ముడతాయన్నమాట. మెగాస్టార్ కి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్వాహకులు రెడీ అయ్యారు. మరోవైపు, చిరంజీవి మొట్టమొదటి సారి బుల్లితెర మీద కనిపించనుండటంతో… ప్రేక్షకుల నుంచి భారీ స్పందన ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి ఓసారి హాజరయ్యారు. అప్పుడు హోస్ట్ నాగార్జున ప్రశ్నలడిగితే.. హాట్ సీట్లో కూర్చున్న చిరంజీవి సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చిరంజీవి ప్రశ్నలు అడిగితే.. హాట్ సీట్లో కూర్చున్నవారు సమాధానాలు చెప్పనున్నారు.