డే/నైట్‌ టెస్టులకు నో చెప్పిన బీసీసీఐ..

237
India will not play D/N Test
- Advertisement -

ఐసీసీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన డే అండ్ నైట్ టెస్టులకు నో చెప్పింది బీసీసీఐ. ఆసీస్ పర్యటనలో భాగంగా టీమిండియా ఎట్టిపరిస్థితుల్లో డే/నైట్ టెస్టులు ఆడబోదని స్పష్టం చేసింది. ఈ ఏడాది నవంబర్ 21 నుంచి జనవరి 19 వరకు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియాకు లేఖ రాసింది బీసీసీఐ.

డే/నైట్‌ టెస్ట్‌ ఆడాలంటే ఆటగాళ్లకు కనీసం 18నెలల పాటు సాధన అవసరమని టీమ్‌ ఇండియా కోచ్‌ రవిశాస్త్రి తెలిపారు. దీంతో బీసీసీఐ క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జేమ్స్‌ సదర్లాండ్‌కు డే/నైట్ టెస్టులు ఆడబోమని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలన్న తపన వల్లే భారత్‌ డే/నైట్ టెస్టుకు విముఖత వ్యక్తం చేస్తోందని జేమ్స్‌ సదర్లాండ్‌ చెప్పడం కొసమెరుపు.

భారత్‌ ఆతిథ్య ఆసీస్‌తో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రతీ జట్టుతోనూ కంగారూలు పింక్‌ బాల్‌ టెస్ట్‌ను ఆడుతున్నారు. అదే విధంగా భారత్‌ కూడా ఆడాలని సీఏ కోరింది. డిసెంబర్‌ 6 నుంచి అడిలైడ్‌ వేదికగా జరిగే టెస్టును పింక్‌ బాల్‌తో నిర్వహించాలని సీఏ భావించింది. కానీ భారత్ తిరస్కరించడంతో సీఏ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

- Advertisement -