కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు..అందరి చూపు ఈ ఎన్నికలపై పడింది. ఈ ఎన్నికల పోరులో ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుతూ ప్రచారహోరులో దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, యెడ్యూరప్ప, సిద్ధరామయ్య తదితరులు జోరుగా ప్రచారం చేస్తోన్న విషయం తెలిసిందే.
ఎలాగైన దక్షిణాదిపై పాగా వేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఈ ఎన్నికలే టార్గెట్‌గా చేయని ప్రయత్నాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఇక మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు ఎన్నికలు అధికారులు. మే 12 జరగబోయే ఈ ఎన్నికల కోసం ఇరు పార్టీ నేతలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఈ రాష్ట్రంలో దళితుల ఓట్ల రాబట్టుకునేందుకు ఎవరి ప్రయాత్నాల్లో వారు మునిగి పోయారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో విజయాలను దాదాపు బీజేపీ తన ఖాతాలో వేసుకుంటు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతుంది.
దక్షిణాధి రాష్ట్రాల్లో ఒకటైన కర్నాటకను కాషాయ మయం చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది బీజేపీ. కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేతలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తు ప్రచార హోరులో ముందుకెళ్తున్నారు. ఇక బీజేపీకి దీటుగా సమాధానమిస్తూ వారి అవినీతిని ఎండగట్టే ప్రయత్నం వైపు అడుగులేస్తున్నారు కాంగ్రెస నేతలు.
ఎన్నికల వేళ దగ్గరపడుతున్న కొద్ది గెలుపును తమ వైపు తిప్పుకునేందుకు సీఎం సిద్ధరామయ్య తన ప్రయత్నం తాను చేస్తున్నారు. ఇక మొత్తానికి కర్నాటక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది నేతల ఒకరిపై మరొకరు విమర్శలకు పని చెబుతున్నారు. మరి మే 12 జరగబోయే ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.