ఆయన నాకు ఆ ఫీల్ కలిగించలేదు..

303
Samantha taljing about on director Mithran..
- Advertisement -

సమంత..చేతినిండా సినిమాలతో వరుస విజయాలతో తన సత్తా ఎంటోమారో సారి రుజువు చేస్తుంది. పెళ్లి అనంతరం కూడా ఎక్కడా సినిమాలకు గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. తాజాగా విడుదలైన రంగస్థలం సినిమా నాన్ బాహుబలిగా రికార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన నటనతో ప్రముఖుల నుంచి ప్రశంసలందుకుంది. నెల రోజుల్లోనే రూ.200 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డులకు వేదికైంది రంగస్థలం.

ఇదిలా ఉండగా తమిళంలో విశాల్ సరసన నటించిన ‘ఇరుంబుతిరై’ సినిమా విడుదలకు సిద్దమైంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ సందర్భంగా సమంత ఈ సినిమా గురించి మాట్లాడుతూ..ఇంటర్నేట్ ద్వారా ఏర్పడే సమస్యలను ఈ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ సినిమాలో కనిపించే సమస్యలను నా స్నేహితులకు ఎదురయ్యాయని తెలిపారు.

 Samantha taljing about on director Mithran..

ఇక సినిమా దర్శకుడి విషయానికొస్తే ముందుగా కొత్త దర్శకుడు కాబట్టి ఆయనతో సినిమా చేయటానికి ఇబ్బందికరంగా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ నేను అనుకున్నది కాకుండా ఆయన నాకు ఆ ఫీల్ అస్సలు కలిగించలేదన్నారు. సామాజిక మాధ్యమాలను మనం సరైన రీతిలో ఉపయోగించుకోవాలని సలహా ఇచ్చారు. ఇక విశాల్‌తో నటించడం చాలా అనందంగా ఉందన్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో తన నటనతో మరో నిరుపించుకుంటారని తెలిపారు సమంత.

- Advertisement -