తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంటూ రేగుతున్న దూమారం అంతా ఇంతా కాదు. ఇటీవల కాలంలో ఫిలింఛాంబర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శనతో శ్రీరెడ్డి చేసిన హల్ చల్ గురించి తెలిసిందే. ఈ తర్వాత పరిణామాలు రాను రాను వ్యక్తిగత విమర్శలు వరకు వెళ్లింది.
పవన్ కల్యాణ్ తల్లిపై శ్రీరెడ్డి ఆరోపణలు చేయడం, తర్వాత క్షమాపణలు చేయడం వంటివి జరిగాయి. ఈ వివాదం అంతటితో ఆగకుండా మెగా ఫ్యామిలీ వరకు వెళ్లింది. టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారని, కాస్టింగ్ కౌచ్‌తో పేరుతో ఎంతో అమ్మాయిలు నష్టపోతున్నారని శ్రీరెడ్డి చేస్తున్నరన్న పోరాటానికి సామాజిక కార్యకర్తల మద్దతు కూడా లభించింది.
ఇక ఈ వివాదానికి కాస్త పులిస్టాప్ పెట్టినట్లైందనుకునే టైంలోనే శ్రీరెడ్డి మారోక వార్తతో మళ్లీ వార్తలోకెక్కింది. తాజాగా శ్రీరెడ్డి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో సభ్యత్వం కోసం రుసుము చెల్లించింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో సభ్యత్వం ఇచ్చినా, ఇవ్వకపోయినా సినీ పరిశ్రమలోని సమస్యలపై తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా తెలుగు తెలుగు హీరోయిన్లకు 70 శాతం అవకాశాలు ఇవ్వాలని, కాస్టింగ్ కౌచ్ నిరోధక కమిటీలో మహిళలకు అవకాశం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ విషయంపై ‘మా’ స్పందించి శ్రీరెడ్డికి సభ్యత్వం ఇస్తారా లేదో చూడాలి మరీ..!