‘దంగల్’ రికార్డును చెరిపేసిన బాహుబలి-2

217
Baahubali 2 BEATS Dangal in round one at the China box office
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచానికి తెలిసేలా పరిచయం చేసిన చిత్రం బాహుబలి-2. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను నెలకోల్పి ఇటీవల కాలంలో జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి.

 Baahubali 2 BEATS Dangal in round one at the China box office

 

ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ప్రభాస్. రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్‌, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ సినిమా విడుదలై ఏడాది దాటినా రూ.1700 కోట్లుపైగా వసూలు చేసి సరికొత్త రికార్డును లిఖించింది. ఈ చిత్రానికున్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. చైనాలో భారతీయ సినిమాలకు క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇటీవల చైనాలో విడులైన ఈ సినిమా సరికొత్త రికార్డులకు వేదికైంది.

 

భారీ ఓపెనింగ్స్‌తో విడుదలైన భారతీయ సినిమా జాబితాలో ‘బాహుబలి 2’ మూడోస్థానంలో దక్కించుకుందంటే ఈ సినిమాకున్న క్రేజ్ ఎంటో స్పష్టంగా అర్ధమవుతుంది. తొలి రోజుకే 2.85 మిలియన్ డాలర్లు అంటే (సుమారు రూ.19) వసూలు చేసింది. ఇక విషయానికొస్తే అమిర్‌ఖాన్ హీరోగా వచ్చిన ‘దంగల్’ చిత్రంపై ఉన్న రికార్డును సైతం చెరిపేసి రికార్డును నెలకోల్పింది బాహుబలి-2. అమిర్‌ఖాన్ నటించిన మరో సినిమా ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’. ఈ సినిమా 6.74 మిలియన్‌ డాలర్లతో మొదటి స్థానంలో ఉంది.

- Advertisement -