మెహ్రీన్ ఖాతాలోకి మరో ఆఫర్..

265
Mehreen to play heroine in Nithin’s next?
- Advertisement -

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి మెహ్రీన్ కౌర్. ఇప్పుడు టాలీవుడ్‌లో యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలను ఒడిసిపట్టుకుంటూ వరుస ఆఫర్లతో జోరును కొనసాగిస్తుంది. గతంలో ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఛలో’ సినిమాతో మంచి హిట్‌లను తన ఖాతాలో వేసుకుని నటిగా మంచి మార్కులనే కొట్టేసింది.

Mehreen to play heroine in Nithin’s next?

తాజాగా ఈ ముద్దుగుమ్మ చేతి నిండి సినిమాలతో బిజీగా మారింది. వెంకటేష్-వరుణ్‌ తేజ్ మల్టీ స్టారర్‌, గోపీచంద్, విజయ్ దేవరకొండ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇప్పుడు ఈ అమ్మడుకు మరో ఆఫర్‌ తన్నుకొచ్చింది. నితిన్ హీరోగా ‘ఛలో’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల సినిమాల్లో నటించే అవకాశాన్నిఛాన్సును కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

గతంతో కేరాఫ్ సూర్య, జవాన్ సినిమాలు నిరాశ పరిచినప్పటికి ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలతో ఖచ్చితంగా హిట్టును సాధిస్తానన్న నమ్మకంతో ఉంది మెహరీన్. ఈ సినిమాలతోనైనా టాలీవుడ్‌ టాప్ హీరోయిన్ల లీస్టులో చేరుతుందో లేదో చూడాలి మరి..!

- Advertisement -