ప్రియా వారియర్..’పెళ్లి’ సందడి

239
Priya Prakash Varrier Singing Hawa Hawa Song
- Advertisement -

భాష, ప్రాంతం అని తేడా లేకుండా ఓర చూపులకు జనాలకు సోయి లేకుండా చేసిన బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. ఓవర్‌ నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ప్రియాను ఫాలో అయ్యే వారి సంఖ్య లక్షల్లో ఉంది. ఇక ప్రియా ఎదైన ఫంక్షన్స్‌కు వెళితే చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడే వారి సంఖ్య కోకొల్లలు.

తాజాగా ఒరు అదార్ లవ్‌లో నటించిన తన సహ నటుడు అరుణ్ వివాహానికి ప్రియావారియర్ హాజరైంది. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రియా వారియర్ పింక్ రంగు చీరలో మెరిసిపోయింది. బాలీవుడ్ మూవీ ‘ఇన్సాఫ్ అప్నే లాహూ సే’ లోని ‘హవా హవా’ అనే పాటకు తన మిత్రులతో కలిసి ప్రియా వారియర్ ఆడిపాడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో ట్రెండింగ్‌గా మారింది. ఈ కార్యక్రామానికి అరుణ్ కుటుంసభ్యులు, సన్నిహితులతో పాటు మాలీవుడ్ ప్రముఖులు కొందరు మాత్రమే పాల్గొన్నారు.

మలయాళ చిత్రం ‘ఒరు అదార్‌ లవ్‌’ సాంగ్‌ టీజర్‌లో సందడి చేసిన ప్రియా, విడుదలకు ముందే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రియాకు వచ్చిన ఆదరణ చూసిన చిత్ర యూనిట్‌ ఆ తర్వాత సినిమాలో ఆమె పాత్ర నిడివిని పెంచేలా రీ షూట్‌ చేశారు. ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌కు ఏ మ్రాతం తీసిపోని ఆదరణ ఆమె సొంతం.

- Advertisement -