చిత్ర పరిశ్రమలో టాలెంటేడ్ కొత్త కొత్త యువ దర్శకులు పుట్టుకొస్తున్నారు. కానీ అందులో మహిళ దర్శకుల సంఖ్య మాత్రం చాలా తక్కువే అనే చెప్పాలి. ఇదే విషయంపై తాజాగా దర్శకుడు క్రిష్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశారు. ‘అది ఒక ఇదిలే’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఆయన ఈ విధంగా స్పందించారు. నేను ఎప్సుడు చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకులు తక్కవగా ఉన్నారని బాధపడుతూ ఉండేవాడినని క్రిష్ జాగర్లమూడి తెలిపారు. కానీ ఆ బాధ ఇప్పుడు లేదని ఈ పవర్ ఫోర్స్లో్కి మహిళా దర్శకురాలు చేరడం సంతోషంగా ఉందన్నారు.
‘అది ఒక ఇదిలే’ చిత్రంతో టాలెంటెడ్ బ్యూటిఫుల్ కొరియేగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ..ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నానంటూ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. క్రిష్ గతంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ జీవిత కథ ఆధారంగా తెరరకెక్కిస్తున్న ‘మణికర్ణిక’ అనే సినిమాకు తెరకెక్కిస్తున్నారు. ఇందులో ముఖ్య పాత్రలో నటిస్తుంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఈ సినిమాకు ప్రముఖ కథ రచయిత విజయేంద్రప్రసాద్ కథ అందించడం విశేషం.
I always feel that there r few female directors in d industry n now happy that d powerful force is increased by 1 with ‘ADI OKA IDILE’ produced by SS Dream Colours n directed by very talented SWARNA MASTER @swarnababu925 known for her acclaimed n beautiful choreography 1/2
— Krish Jagarlamudi (@DirKrish) May 2, 2018