తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనే అంశం ఇటీవల పెను ప్రకంపనలు రేపిన సంగతి మనకు తెలిసిందే. అయితే సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ఏర్పాటైన కమిటీ సమావేశం అయింది. ఈ కమిటీ భేటీలో మహిళల భద్రతపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెక్స్ వల్ హారాస్ మెంట్ కు వ్యతిరేకంగా ఒక ప్యానెల్ నియమిస్తున్నట్లు తెలిపారు. ఇందులో 50శాతం ప్రతినిధులు బయటవారు ఉంటారని తెలిపారు. ఇందులో డాక్టర్లు, లాయర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యావేత్తలు, సైకాలజిస్టులు సభ్యులుగా ఉండనున్నారు. ప్యానెల్ నియమ నిబంధనల రూపొందించేందకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్ ఎన్.శంకర్ వెల్లడించారు.
ఆడిషన్స్ జరిగే సమయంలో మహిళా సిబ్బందితోపాటు విధిగా కెమెరా ఉండి తీరాలని నిర్ణయించిట్లు ప్రకటించారు. 24 క్రాఫ్ట్ లోని మహిళల అంశాలు, సమస్యల పరిష్కారానికి వర్క్ షాప్ నిర్వహించాలని డిసైడ్ అయ్యింది ఫిల్మ్ ఛాంబర్. లైంగిక వేధింపులపై ఏర్పాటు చేయనున్న ప్యానల్ లో షీ టీం కూడా ఉంటుందని.. అదే విధంగా డైరక్ట్ హాట్ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది ఫిల్మ్ ఛాంబర్. మోడలింగ్ కో ఆర్డినేటర్స్‌కి సరైన లైసెన్సింగ్, అర్హతలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా ఇండస్ట్రీలోకి ప్రవేశించాలనే నటీనటులకు మార్గదర్శనం చేసేందుకు మరో ప్యానల్‌ను ఏర్పాటుచేస్తాం. తెలుగు సినీ పరిశ్రమలోని మహిళలు సురక్షితమైన వాతావరణంలో పనిచేసేలా ధీర్ఘకాలిక చర్యలు చేపడుతమాని చెప్పారు సినీ పెద్దలు.