హిందూ సంప్రదాయంలో… ముస్లిం యువతి పెళ్లి శుభలేఖ..

333
Muslim Girl wedding invitation cards in Hindhu Gods
- Advertisement -

హిందూ ముస్లిం బాయి బాయి అంటూ మత సామరస్యాన్ని చాటాడు ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన మహ్మద్ అనే ముస్లిం వ్యక్తి. యూపీలోని సుల్తానాపూర్ లని బాగ్ సరి గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఓ అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయి పెళ్లికి హిందూ సంప్రదాయ పద్దతిలో లగ్గ పత్రిక అచ్చువేయించాడు పెళ్లి కూతురి తండ్రి మహ్మద్ సలీం.

ఆ పత్రికలో సీతారాముల దేవుళ్ల చిత్రాలు కూడా అచ్చువేయించాడు. ఆ పత్రికలను హిందూ మతానికి చెందిన తన మిత్రులకు, పరిచయస్తులకు పంచాడు.అంతేకాదు కాకుండా ఆ పత్రికతో పాటు కలశం, దీపాలు, అరటి ఆకులు, పూలు వంటి వస్తువులను కూడా పంచి మతసామరస్యాన్ని చాటాడు. ఆ ముస్లిం కుటుంబ చేసిన పని పట్ట సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -