సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ్ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై సెన్సిబుల్ డైరెక్టర్ ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం తేజ్ ఐ లవ్ యూ. తొలిప్రేమ, బాలు, డార్లింగ్ వంటి బ్యూటీఫుల్ లవ్‌స్టోరీస్‌ని తెరకెక్కించిన కరుణాకరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. తేజు సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోండగా మేడే సందర్భంగా సినిమా టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.
ఓ బస్టాప్‌లో వర్షం పడుతుండగా సాయిధరమ్ టీ తాగే సీన్‌లో హీరోయిన్ ఉహించుకోవడం…తన దగ్గరే తనతో పాటే టీ తాగుతున్నట్లు విడుదల చేసిన రొమాంటిక్ టీజర్ యూత్‌ని ఆకట్టుకుంటోంది. సాయిధరమ్ తేజ్ నవతరం ప్రేమికుడిగా కనిపించగా…. అనుపమ పరమేశ్వరన్ అందంతో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకుంది.
రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి కాగా, ప్రస్తుతం పారిస్‌లో పాటల్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం . కుటుంబ అనుబంధాలు మేళవించిన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అందరిని మెప్పిస్తుందని నిర్మాతలు అన్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మిస్తుంగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.