ఐపీఎల్‌-11లో ముంబయి గెలుపు ..

210
Mumbai Indians beat Chennai Super Kings by 8 wickets
- Advertisement -

ముంబయి ఇండియన్స్‌ మళ్లీ ఓ గెలుపు రుచిచూసింది. శనివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యాన్ని ముంబయి మరో రెండు బంతులుండగా 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫామ్‌ అందుకున్న రోహిత్‌ శర్మ (56 నాటౌట్‌; 33 బంతుల్లో 6×4, 2×6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌ (47; 43 బంతుల్లో 3×4, 2×6), సూర్యకుమార్‌ యాదవ్‌ (44; 34 బంతుల్లో 5×4, 1×6) కూడా రాణించారు. మొదట సురేశ్‌ రైనా (75; 47 బంతుల్లో 6×4, 4×6), అంబటి రాయుడు (46; 35 బంతుల్లో 2×4, 4×6) రాణించడంతో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రోహిత్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.

Mumbai Indians beat Chennai Super Kings by 8 wickets

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: వాట్సన్‌ (సి) మార్కండే (బి) కృనాల్‌ 12; రాయుడు (సి) కటింగ్‌ (బి) కృనాల్‌ 46; రైనా నాటౌట్‌ 75; ధోని (సి) లూయిస్‌ (బి) మెక్లెనగన్‌ 26; బ్రావో (సి) మార్కండే (బి) మెక్లెనగన్‌ 0; బిల్లింగ్స్‌ (సి) కటింగ్‌ (బి) హార్దిక్‌ 3; జడేజా నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 169;
వికెట్ల పతనం: 1-26, 2-97, 3-143, 4-144, 5-161;
బౌలింగ్‌: మెక్లెనగన్‌ 4-0-26-2; బుమ్రా 4-0-25-0; హార్దిక్‌ పాండ్య 4-0-39-1; కృనాల్‌ పాండ్య 4-0-32-2; మయాంక్‌ మార్కండే 3-0-30-0; కటింగ్‌ 1-0-14-0

Mumbai Indians beat Chennai Super Kings by 8 wickets

ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) జడేజా (బి) హర్భజన్‌ 44; లూయిస్‌ (సి) ఠాకూర్‌ (బి) బ్రావో 47; రోహిత్‌ శర్మ నాటౌట్‌ 56; హార్దిక్‌ పాండ్య నాటౌట్‌ 13; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (19.4 ఓవర్లలో 2 వికెట్లకు) 170;
వికెట్ల పతనం: 1-69, 2-128;
బౌలింగ్‌: చాహర్‌ 2.1-0-19-0; శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-38-0; వాట్సన్‌ 4-0-41-0; హర్భజన్‌ సింగ్‌ 3.5-0-20-1; తాహిర్‌ 2.4-0-26-0; బ్రావో 3-0-21-1

- Advertisement -