మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ సినిమా ఇటీవలె విడుదలై రికార్డులను బ్రేక్ చేస్తోంది. కాగ విడుదలైన రెండు రోజులకే వంద కోట్ల మార్క్‌ను దాటడం విశేషం. ఇక విషయానికొస్తే లండన్‌లోని ప్రముఖ మెడమ్ టుస్కాడ్‌లో మ్యూజియంలో మహేష్‌బాబు మైనపు విగ్రహాన్ని పెడుతున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు మహేష్. ‘ప్రఖ్యాతి గాంచిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో భాగం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆర్టిస్ట్‌లందరూ దగ్గరుండి నా వివరాలు సేకరించినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
భరత్ అనే నేను చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఓ గొప్ప విజయాన్ని అందుకున్న నేపధ్యంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్‌కు మైనపు విగ్రహం రూపొందించాలని నిర్ణయించినట్లు సమాచారం. గతంలో ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన సంచలనం మనకు తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ వరల్డ్ వైడ్‌గా ఆయన ప్రత్యేక గుర్తింపును సాధించారు. ఈ సందర్భంగా ప్రభాస్ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ విగ్రహాన్ని కూడా మేడమ్ టుస్సాడ్స్‌లో పెడుతున్నట్లు ఇటీవల సత్యరాజ్ కుమారుడు సిబి సత్యారాజ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
Super happy to be a part of the prestigious Madame Tussauds 🙂 🙂
Thanks to the team of artists for their attention to detail. Incredible! pic.twitter.com/fyZHlxJE6k— Mahesh Babu (@urstrulyMahesh) April 26, 2018