టీఆర్ఎస్ ప్లీనరీ…మెను ఇదే

257
Biryani-mutton curry for plenary delegates
- Advertisement -

టీఆర్ఎస్ 17వ ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కొంపల్లిలోని జీబీఆర్‌ గార్డెన్స్‌లో 27న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్లీనరీ సమావేశం జరగనుంది. ప్రతి నియోజకవర్గం నుంచి 100 మందికి పైగా కార్యకర్తలు గులాబీ పండుగకు హాజరుకానున్నారు.

టీఆర్ఎస్ ప్లీనరీ అంటే భారీ తోరణాలు, స్వాగత ఏర్పాట్లే కాకుండా వచ్చిన వారికి ….నచ్చిన ఫుడ్ పెట్టేందుకు పెద్దఎత్తున వంటకాలను రెడీ చేయిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ వంటకాల రుచి చూపించబోతున్నారు. 20వేల మందికి భోజనాలతోపాటు టీ, స్నాక్స్, మజ్జిగ, అంబలి కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్లీనరీ ప్రాంగణంలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.

TRS Plenary Menu

ప్లీనరీ కోసం వచ్చే ప్రతినిధులకు 27 రకాల ఫుడ్‌ ఐటమ్స్‌ను సిద్ధం చేస్తున్నారు. వీటిలో హైదరాబాద్ స్పెషల్ బిర్యానీతో పాటు మటన్ బిర్యానీ, ధమ్ చికెన్ ఫ్రై, మటన్ షారువా, ఫిష్ ఫ్రై, మటన్ దాల్శా, ఎగ్ పులుసు‌తోపాటు మిర్చికా సలాడ్, బగారా రైస్, ప్లెయిన్ రైస్, ఆలూ టమాటా కర్రీ, పప్పు చారు, పచ్చి పులుసు, పెరుగు చట్నీపెరుగు సిద్ధం చేయబోతున్నారు.

సమ్మర్‌ కావడంతో అందుకు తగ్గట్టుగా ఐస్‌క్రీమ్స్‌, ఫ్రూట్‌ సలాడ్స్‌, స్వీట్లు తయారు చేయిస్తున్నారు, ఆ లిస్టులో ఫైనాపిల్ ఫెర్నీ స్వీటు, ఫ్లమ్ కేక్ ఐస్ క్రీమ్‌, కట్ ఫ్రెష్ ఫ్రూట్, స్వీట్ పాన్, గ్రీన్ సలాడ్, ఆనియన్ సలాడ్ లాంటివి సిద్ధంచేస్తున్నారు.

- Advertisement -