ఈ నెల 27న కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్‌లో టీఆర్ఎస్ 17వ ప్లీనరీ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్లీనరీ ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి. వేసవిని దృష్టిలో ఉంచుకుని వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్లీనరీ వేదికకు ప్రగతి ప్రాంగణంగా నామకరణం చేశారు.
ప్లీనరీ వేదిక ఏర్పాట్లను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. ప్లీనరీలో అన్ని అంశాలపై చర్చిస్తామని తెలిపారు. 2019లోనూ గెలుపు TRS పార్టీదే అని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ – ప్రభుత్వం రెండూ సమానమే అన్నారు. ప్రజల మద్దతు ఎప్పటికీ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్‌కే ఉంటుందని స్పష్టం చేశారు ఈటల.
ఎన్నో అవమానాలు భరించి గమ్యాన్ని ముద్దాడిన పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ అని తెలిపారు. కేసీఆర్ దీక్షా దక్షతలను గుర్తించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు. అతి తక్కువకాలంలోనే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతురామ్మోహన్ ప్రారంభించారు.
ప్లీనరీ కమిటీలు….
ఆహ్వాన కమిటీ: మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ సిహెచ్.మల్లారెడ్డి
సభా ప్రాంగణం, వేదిక: టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
మీడియా కోఆర్డినేటర్స్: ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్,మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
సాంస్కృతిక కమిటీ: రసమయి బాలకిషన్
ప్రతినిధుల నమోదు, పార్కింగ్: వివేకనంద్ గౌడ్, ఎం.సుధీర్ రెడ్డి, సిహెచ్.కనకారెడ్డి
నగర అలంకరణ: మేయర్ బొంతు రామ్మెహన్
వాలంటరీ కమిటీ:మైనంపల్లి హన్మంతరావు, బాబా ఫసియుద్ధీన్,చిరుమళ్ల రాకేశ్
భోజన కమిటీ: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు