క్రికెటర్‌ బ్రేవోతో శ్రియ డేటింగ్..!?

187
- Advertisement -

సినీ భామలు బౌలింగ్‌ చేస్తే క్లీన్‌ బౌల్డ్‌ అవ్వని క్రికెటర్‌ ఎవరు? క్రికెటర్లు సినీ తారల వలలో పడడం కొత్తదేమీ కాదు. బాలీవుడ్‌ తారలు క్రికెటర్ల మోజులో పడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కొన్ని పెళ్లిళ్ల దాకా వెళ్లగా, మరికొన్ని మధ్యలోనే బెడిసికొట్టి విషాదాంతాలుగా ముగిశాయి. తాజాగా హీరోయిన్ శ్రియ వెస్టిండీస్ క్రికెటర్ బ్రేవోతో ప్రేమలో పడిందన్న వార్త బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది.

వెస్టిండీస్ క్రికెటర్ బ్రేవోతో ప్రేమలో పడిందట…. ఎడాపెడా తిరిగేస్తుందట… ఇప్పటిదాకా పెద్దగా ఎవరితోనూ అఫయిర్స్, బ్రేకప్పులూ లేకుండా బతికిన ఆమె ఇప్పుడు ఈ క్రికెటర్ తో డేటింగ్ లో ఉందట. ఒకప్పుడు టాప్ హీరోల అందరి సరసన నటించిన శ్రేయకు ఈ మధ్య సరైన ఆఫర్లు రావడంలేదు. నిజానికి శ్రియ కెరీర్ చాలా ఒడిదొడుకుల్లో ఉంది.

shriya-saran-dwayne-bravo_640x480_71476347182

ఇక ఐపీఎల్‌ పుణ్యమా అని.. వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు భారత్‌కు బాగా అలవాటు పడ్డారు. ఐపీఎల్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీలు కూడా ఉండనే ఉన్నాయి. ఆ పార్టీలకు బాలీవుడ్‌ హీరోయిన్లు హాజరౌతుడడం.. హీరోయిన్లకు.. క్రికెటర్లకు చనువు పెరుగుతుండడం సర్వసాధారణం. అలా వెస్టీండిస్‌ ఆల్‌రౌండర్‌ డ్వాన్ బ్రేవోతో శ్రియ లవ్ ట్రాక్ నడిచిందట. ఐపీఎల్ లో ఆడుతూనే ఇండియాతో మంచి అనుబంధాన్నే పెంచుకున్నాడు బ్రేవో. సహజంగానే ఎంతోకాలంగా సినీతారలు క్రికెటర్లపై మరీ మరీ మోజు చూపించడం అనేది తెలుసు కదా. అలా శ్రియ బ్రేవోతో ప్రేమలో పడిపోయిందట. వీరిద్దరూ ముంబైలో ఓ రెస్టారెంట్‌ దగ్గర కనపడడంతో కెమెరాలు క్లిక్‌మన్నాయి. మరి వీరి ప్రేమ పెళ్లి దాకా చేరుతుందా లేదా అని బాలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

- Advertisement -