ఐపీఎల్-11 రసవత్తరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే, అయితే ఐపీఎల్‌కి సంబంధించిన కొన్న చిన్న చిన్న వీడియోలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. ఇప్పుడు హైదరాబాద్ ఆటగాడు అలెక్స్ హేల్స్ చెప్పిన హీరో బాలకృష్ణ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నందమూరి బాలకృష్ణ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్‌ని అంచం అలెక్స్ హేల్స్ చెప్పడంతో వీడియా వైరల్ అయ్యింది.
అసలు విషయానికి వస్తే నేడు హైదరాబాద్‌లో సన్ రైజర్స్-చెన్నై సూపర్ కింగ్స్ తలబడనున్న సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ ఆటగాళ్లు భువనేశ్వర్, మనీష్ పాండే. అలెక్స్ హేల్స్‌లు శనివారం బంజారాహిల్స్‌లోని సెంట్రో షోరూమ్‌లో సందడి చేశారు. ‘జస్ట్ ఛేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పలువురు వర్ధమాన క్రీడాకారులతో ముచ్చటించారు.
ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో చిన్నారులు హాజరయ్యారు. కొ్ందరు చిన్నారులు హైదరాబాద్ ఆటగాళ్లను సరదా.. సరదా.. ప్రశ్నలతో ఒక ఆట ఆడుకున్నారు. ఆ చిన్నారుల కోరిక మేరకు శ్రీమన్నారాయణ’ సినిమాలో బాలకృష్ణ చెప్పిన ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్..’ అంటూ చిన్నారులను అలరించారు అలెక్స్. క్రికెట్ ఆడకపోయి ఉంటే ఏం చేశేవారు అని ఓ చిన్నారి అడగగా.. ఆర్మీలో చేరేవాడినని భువి తెలియజేశాడు.
క్రీడాకారులుగానే కాకుండా జీవితంలో ఎదగాలంటే కష్టపడేతత్వం ఉండాలని, కష్టపడితే ఏదైనా సాధించగలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు భువి. సన్ రైజర్స్ జట్టులో చిలిపి చేష్టలు ఎవరు చేస్తారిని మరో చిన్నారి అడగగా.. మా టీంలో బిపుల్ శర్మ కామెడీ బాగా చేస్తాడని, అందరినీ ఆటపట్టిస్తూ ఉంటాడని మనీష్ పాండే చిన్నారులకు తెలియజేశారు.
https://www.youtube.com/watch?v=Fwj9N9SO8hw