తెలుసు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసందే. అయితే ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేసింది. ఈ మేరకు ఆమెపై హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలుచేసిందని సినీనటుడు శివ బాలాజీ ఫిర్యాదు చేశాడు. అమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆమె పవన్ కల్యాణ్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని శివ బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలకు జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. ఈ ఫిర్యాదుపై ఓ లాయర్ మాట్లాడుతూ.. ఈ కేసు సమర్థవంతంగా ముందుకు వెళితే శ్రీరెడ్డి చేసిన వ్యక్తిగత దూషణలకు ఆమెకు రెండు నుంచి ఐదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని లాయర్ తెలిపారు. పవన్ కల్యాణ్ ని దూషించమని చెప్పింది నేనే అని రాంగోపాల్ వర్మ చెప్పిన విషయం తెలిసిందే. అయితే వర్మపై కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.