గత కొన్ని రోజులగా తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న అంశం క్యాస్టింగ్ కౌచ్. శ్రీరెడ్డి చేస్తున్న ఈ ఆరోపణలతో టాలీవుడులో పెద్ద దుమారమే చెలరేగింది. ప్రస్తుతం టాలీవుడులో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై నటుడు, నడిఘర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ స్పందించాడు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని సింపుల్ గా అనేయొద్దని, కాస్టింగ్ కౌచ్ జరిగిందని నిరూపించాలని విశాల్ పేర్కొన్నారు. కాస్టింగ్ కౌచ్ జరిగిందని కచ్చితమైన ఆధారాలతో వస్తే బాధితులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేసారు. ఎవరో ఒకరిద్దరు చేసే ఈ విధానాన్ని మొత్తం సినీ పరశ్రమలోనే కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పడం సరికాదన్నారు.
చిత్ర పరిశ్రమలో అన్యాయం జరిగిందని ధైర్యంగా చెప్పే స్త్రీలను తాను గౌరవిస్తానని, వారికి కచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గతంలో అమలాపాల్, వరలక్ష్మి ఈ ఆరోపణలతో నడిగర్ సంఘాన్ని ఆశ్రయిస్తే వారికి న్యాయం చేశామని గుర్తుచేశారు. తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న ఈ కాస్టింగ్ కౌచ్ వివాదం అతి త్వరలో పరిష్కారమమవుతుందని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు.