సల్లూభాయ్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి…

215
Jodhpur Court seeking Salman Khan permission to visit 4 countries
- Advertisement -

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కి ఊరట లభించింది. కృష్ణజింకల వేట కేసులో శిక్ష పడి బెయిల్‎పై సల్మాన్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఒకరోజు తర్వాత రూ.50 వేల పూచీకత్తుతో సల్మాన్‎ఖాన్‎కి బెయిల్ మంజూరు చేయడంతో సల్మాన్‎తో సహా, ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే.‎

Jodhpur Court seeking Salman Khan permission to visit 4 countries

అయితే కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని షరతు ఉండడంతో, తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సల్మాన్ కోర్టుకు ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన అనంతరం విదేశీ పర్యటనకు వెళ్లేందుకు జోధ్‎పూర్ డిస్టిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు అనుమతి మంజూరు చేసింది. కోర్టు అనుమతి ఇవ్వడంతో కెనడా, నేపాల్, అమెరికా పలు దేశాలలో ఈనెల 25 నుంచి జూలై 10 వరకు సల్లూ భాయ్ పర్యటించేందుకు వీలుపడింది.

- Advertisement -