సింధుపై సైనా విజయం..

282
Saina beats Sindhu for gold
- Advertisement -

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్‌లో స్వర్ణం దక్కింది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా సైనా నెహ్వాల్ నిలిచింది. ఆమె ప్రత్యర్థి పీ వీ సింధుపై వరుస గేమ్స్‌లో గెలిచి, బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. పీ వీ సింధుకు రజత పతకం దక్కింది. సైనా అద్భుత ఆటను కనబరిచింది. 21-18, 23-21తో సింధుపై గెలిచింది. ఆట ప్రారంభం నుంచి సింధుపై సైనా తీవ్ర ఒత్తిడి పెట్టింది.

Saina beats Sindhu for gold

అయితే సింధు రెండో గేమ్‌లో సైనాకు నువ్వా నేనా అన్నట్లు గట్టి పోటీ ఇచ్చింది. ఓపెనింగ్ గేమ్‌లో ప్లేస్‌మెంట్స్‌తో చాలా ఇబ్బంది పడింది. రెండో గేమ్‌లో సింధు పుంజుకునే ప్రయత్నం చేసినప్పటికీ, సైనా విజృంభించి ఆడి, గేమ్‌ను సొంతం చేసుకుంది. వరుసగా రెండు గేమ్స్‌లో విజయం సాధించడంతో సైనా నెహ్వాల్ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఈ గెలుపుతో మరో స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది.

- Advertisement -