రానా కథనాయకుడిగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఘాజీ’. 1971లో భారత్-పాకిస్థాన్ ల మధ్య సముద్ర గర్భంలో జరిగిన యుద్దాలను ఇతి వృత్తంగా తెరకెక్కిన ఘాజీ చిత్రానికి ఉత్తమ (తెలుగు) చిత్రంగా జాతీయ అవార్డు వరించింది. నిన్న (శుక్రవారం) జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ చిత్రానికి అవార్డు ప్రకటనపై స్పందించింది హీరోయిన్ తాప్సీ.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..‘‘ఘాజీ’కి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు లభించడం ఎంతో సంతోషంగా ఉంది. నేను నటించిన సినిమాల్లో జాతీయ అవార్డు సాధించిన మూడో చిత్రమిది. ఈ సినిమాలో నా పాత్ర నిడివి తక్కువే.. అయినా.. ఓ నటిగా సినిమా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. ఈ వార్త తెలిసిన వెంటనే సంబరపడ్డా’ అని హీరోయిన్ తాప్సీ తెలిపారు.
ఝుమ్మంది నాధం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ సుందరి ప్రస్తుతం బాలీవుడ్‌లో జోరును కొనసాగిస్తుంది.‘పింక్’ సినిమాతో బాలీవుడ్‌లో మంచి బ్రేక్ తెచ్చుకుని ఆ తర్వాత ‘నామ్ షబానా’, ‘జుడ్వా 2’ వరుస హిట్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం బాలీవుడ్ కొన్ని చిత్రాల్లో నటిస్తూ విభిన్న పాత్రలను అందిపుచ్చుకుంటూ తన హవాను కొనసాగిస్తుంది.